Hoppa till innehåll

Virat kohli biography in telugu language origin

విరాట్ కోహ్లి

పుట్టిన తేదీ (1988-11-05) 1988 నవంబరు 5 (వయసు 36)
ఢిల్లీ, భారతదేశం
మారుపేరుచీకూ keep count of ofvMd ashraf[1]
ఎత్తు5 అ. 9 అం. (175 cమీ.) [2]
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్‌ మీడియం పేస్
పాత్రబ్యాట్స్ మెన్
బంధువులు

అనుష్క శర్మ (భార్య)

(m. 2017)​
Vamika daughter
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 269)2011 జూన్ 20 - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు2022 జనవరి 11 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 175)2008 18 ఆగస్టు - శ్రీలంక తో
చివరి వన్‌డే2021 మార్చి 28 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.18
తొలి T20I (క్యాప్ 31)2010 జూన్ 12 - జింబాబ్వే తో
చివరి T20I2024 జూన్ 29 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.18
YearsTeam
2006– ప్రస్తుతంఢిల్లీ
2008– ప్రస్తుతంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(స్క్వాడ్ నం. 18)
పోటీటెస్టులుODIటీ20ఫస్ట్ - క్లాస్
మ్యాచ్‌లు9925491130
చేసిన పరుగులు7,96213,0243,21613,024
బ్యాటింగు సగటు50.3959.0752.0451.28
100లు/50లు29/2850/661/2934/35
అత్యుత్తమ స్కోరు254
నాట్అవుట్
183122
నాట్అవుట్*
254
నాట్అవుట్*
వేసిన బంతులు175641146643
వికెట్లు0443
బౌలింగు సగటు166.2549.50112.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు000
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు000
అత్యుత్తమ బౌలింగు1/151/131/19
క్యాచ్‌లు/స్టంపింగులు98/–132/–42/–129/–

మూలం: ESPNcricinfo,, 15 జనవరి 2022

విరాట్ కోహ్లి ( జననం: 1988నవంబరు 5[3]) ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.

మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్-క్లాసు క్రికెట్‌లోఅతను ఢిల్లీజట్టుకు ప్రాతినిధ్యం వహిoచాడు. అతను 2008లోరాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరఫున, 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు.[4] పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ ను అభ్యసించాడు.

కోహ్లి ఒక మిడిల్ ఆర్డర్ బాట్స్ మన్, ఇతను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా కూడా ఆడగలడు. బ్యాట్స్ మన్ కొరకు ICC ODI రాంకింగ్ లలో 873 పాయింట్ లతో కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు. కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్ కు అతను ప్రసిద్ధి చెందాడు. అతను రైట్ ఆర్మ్ మీడియం పేస్ లో కూడా బౌలింగ్ చేయగలడు.[5]కోహ్లీ 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడంతో భారత టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

ఆయన 15 జనవరి 2022న టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు.[6][7]

దేశీవాళీ క్రికెట్

[మార్చు]

తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లి మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అతని కుటుంబానికి అతని అవసరం బాగా ఉన్న కీలక క్షణములలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది.

కానీ అతను తను బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి 90 పరుగులు చేసాడు. ఇది క్రికెట్ పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది.[8] ఈ మ్యాచ్ ను ఢిల్లీకి అనుగుణంగా మార్చటంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైనది.

2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో విజయాన్ని సాధించిన భారత జట్టుకి కోహ్లి సారథ్యం వహించాడు.[9] నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, వెస్ట్ ఇండీస్ U-19 తో ఆడిన మ్యాచ్ లో సాధించిన వంద పరుగులతో సహా 6 మ్యాచ్ లలో సగటున 47 పరుగులతో అతను మొత్తం 235 పరుగులు సాధించాడు.[10] ఆ టోర్నమెంట్ సమయంలో బౌలింగ్ లో అతను చేసిన పలు యుక్తికరమైన మార్పులకు అతను ప్రశంసలు కూడా అందుకున్నాడు.[11]

2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్

[మార్చు]

ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో ఇండియా విజయం సాధించటానికి కోహ్లినే కారకుడు.

దక్షిణ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ (ఆఖరి మ్యాచ్) లో, కోహ్లి భారతదేశం కొరకు ఒక శతకం (వంద పరుగులు) సాధించాడు. 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. రెండు శతకములు, రెండు అర్ధ శతకములతో సహా ఏడు మ్యాచ్ లలో మొత్తం 398 పరుగులతో, కోహ్లి ఆ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు సాధించినవాడు అయ్యాడు.[https://cinecelebrity.in/virat-kohli-wiki-biography/ 1]

ఇండియన్ ప్రీమియర్ లీగ్

[మార్చు]

కోహ్లి 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు.[12] 2008 లో IPL మొదటి సీజన్ (అంకము) కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు $30,000 లకు అతనిని కొన్నది.

IPL మొదటి సీజన్ లో అతను అంత బాగా ఆడలేదు. 13 ఇన్నింగ్స్ లో సగటున 15 పరుగులతో మొత్తం 165 పరుగులు మాత్రమే చేసాడు, తన బౌలింగ్ లో డెక్కన్ చార్జర్స్ పైన మాత్రమే కేవలం రెండు వికెట్లు తీసాడు, ఆ సీజన్ మొత్తంలో కేవలం రెండు క్యాచ్ లు మాత్రమే పట్టుకున్నాడు. కానీ IPL రెండవ సీజన్ లో అతను కొద్దిగా మెరుగయ్యాడు. ఇక్కడ అతను 11 ఇన్నింగ్స్ లో 21.5 పరుగుల సరాసరితో 215 పరుగులు చేసాడు, 9 క్యాచ్ లు, 2 రన్ అవుట్లు తీసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్లో అతను రెండు అర్ధ శతకములు సాధించాడు. ఆసక్తికరంగా ఇతను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తమ జట్టులో నిలుపుకున్న ఏకైక ఆటగాడు. వారు రాహుల్ ద్రావిడ్, రాస్ టేలర్ ల కన్నా ఇతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

వన్ డే ఇంటర్ నేషనల్స్ (ఒక రోజు ఆడే అంతర్జాతీయ ఆట)

[మార్చు]

2008 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో వంద పరుగులు సాధించిన తర్వాత, జట్టుకు ఎంపికయ్యాడు.[13]సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్లో కోహ్లి మొదటిసారి వన్ డే ఇంటర్ నేషనల్స్ లో అడుగుపెట్టాడు.

అతను మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రారంభించాడు, కానీ 12 పరుగులకే అవుట్ అయిపోయాడు. కానీ ఆ సీరీస్ లో అతి తక్కువ పరుగులు చేసిన రెండవ మ్యాచ్ లో అతను అత్యంత కీలకమైన 37 పరుగులు చేసాడు, అది ఇండియా గెలుపుకి, ఆ సీరీస్ ని సమం చేయటానికి సహాయపడింది. నాలుగవ మ్యాచ్ లో అతను 54 పరుగులతో, తన మొదటి అర్ధ శతకాన్ని సాధించాడు, ఇది ఇండియా ఆ సీరీస్ గెలుపొందటానికి సహాయపడింది.

శ్రీలంకలో శ్రీలంకతో జరిగిన వన్ డే సీరీస్ లో ఇండియాకు ఇది మొదటి గెలుపు. తరువాత అదే సంవత్సరం ఇంగ్లాండ్ తో మన దేశంలోనే జరిగిన ODI సీరీస్ కొరకు అతను జట్టులో చేర్చుకోబడ్డాడు, కానీ టెండూల్కర్, సెహ్వాగ్ ఇద్దరూ జట్టులోకి తిరిగి రావటంతో అతనికి ఆడటానికి అవకాశం రాలేదు. అల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేసుకున్నందుకు గాను జనవరి 2009న శ్రీలంకలోశ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ ల ODI సిరీస్ న

2009 మధ్య నుండి రిజర్వ్ ODI బ్యాట్స్ మన్ గా ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సీరీస్ కి యువరాజ్ తిరిగి శారీరికంగా యోగ్యత సాధించాడు, కావున ఆ సీరీస్ లో కోహ్లి కేవలం కొన్ని మ్యాచ్ లలో మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా యువరాజ్ తప్పుకోవటంతో, డిసెంబరు 2009 లో శ్రీలంక భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు నాలుగవ ODI లో ఆడటానికి కోహ్లికి అవకాశం వచ్చింది. గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన మొదటి ODI శతకాన్ని సాధించాడు.

మూడవ వికెట్ కి వారు 224-పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఆ మ్యాచ్ లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి 3–1 స్కోరుతో ఆ సీరీస్ ని కైవసం చేసుకుంది. ఆ సీరీస్ లో అతని ప్రదర్శనకు గౌతమ్ గంభీర్ తన మాన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లికి ఇచ్చాడు.

జనవరి 2010 లో బంగ్లాదేశ్ లో జరిగిన మూడు-దేశముల టోర్నమ నుండి వయస్సులో అతని కన్నా పెద్దవాడైన బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ తప్పుకోవటంతో ఇండియా ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ కోహ్లి ఆడాడు.

2010 జనవరి 7 న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా త్వరగా ఇండియా బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. దానికి ప్రతిగా తొమ్మిది పరుగులకే శ్రీలంక చేతిలో మొదటి వికెట్ పడిపోయిన తర్వాత, ఒక గెలుపును తమ ఖాతాలో నమోదు చేసుకోవటంలో ఇండియాకు సహాయంగా అతను 91 పరుగుల అత్యధిక స్కోరు చేసాడు. వారు వారి లక్ష్యాన్ని త్వరగా చేరుకున్న తర్వాత ఒక బోనస్ పాయింట్ తో ఇండియాకు విజయాన్ని అందించటానికి అతను వికెట్ కోల్పోకుండా చివరివరకూ ఆడి 71 పరుగుల వద్ద ముగించాడు.

తర్వాతి రోజు, బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో అతను తన రెండవ ODI సెంచరీ చేసి, తను సాధిస్తున్న పరుగులతో తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్నాడు. ఆ టోర్నమెంట్ సమయంలో అతను తన ప్రదర్శనకు బాగా ప్రశంసలు అందుకున్నాడు, టెండూల్కర్, సురేష్ రైనా అడుగుజాడలలో నడుస్తూ, తమ ఇరవై రెండవ జన్మదినానికి ముందే రెండు ODI సెంచరీలు సాధించిన మూడవ భారతీయుడు అయ్యాడు.[14] అయినప్పటికీ, శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో అతను కేవలం రెండు పరుగులు మాత్రమే చేసాడు.

ఆ మ్యాచ్ లో ఇండియా అరవై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చిట్టచివరకు నాలుగు-వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

జూన్ 2010లో శ్రీలంక, జింబాబ్వేలతో, జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు-సీరీస్ నుండి మిగిలిన ప్రముఖ ఆటగాళ్ళు అందరూ తప్పుకోవటంతో అతను భారత జట్టుకు ఉప-సారథిగా నియమించబడ్డాడు.ప్రస్తుత Odi లో అతను మొదటి ఉత్తమ బ్యాట్స్ మన్ కూడా. డే/నైట్ (పగలు/రాత్రి) మ్యాచ్ లలో భారతీయ బ్యాట్స్ మెన్ అందరి కన్నా అతను అత్యధిక సరాసరి కలిగి ఉన్నాడు.

ప్రపంచ కప్ 2011

[మార్చు]

2011 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడిన ప్రారంభ మ్యాచ్ లో కోహ్లి వంద పరుగులు (సెంచరీ) చేసాడు. తన ఊరివాడైన వీరేందర్ సెహ్వాగ్తో కలిసి అతను 203-పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. అతను సురేష్ రైనా కన్నా ముందు బరిలోకి దిగటానికి ఎంపికయ్యాడుమరియు ప్రపంచ కప్ లో ఆడిన మొదటి సారే వంద పరుగులు చేసిన మొదటి భారతీయుడు అయ్యాడు.

కానీ దక్షిణ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ఇండియా ఆడిన ముఖ్యమైన మ్యాచ్ లలో కోహ్లి ఎక్కువ పరుగులు సాధించగలగలేకపోయాడు.

వంద క్యాచ్‌ల ఘనత

[మార్చు]

జనవరి 12, 2022న జరిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా మహ్మద్ షమి వేసిన 56వ ఓవర్‌ రెండో బంతికి తెంబా బవుమా ఇచ్చిన ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ క్యాచ్‌ను ఎంతో చాకచక్యంగా క్యాచ్‌ అందుకున్న విరాట్‌ కోహ్లీకి టెస్టుల్లో వందో క్యాచ్‌గా నమోదయింది.[15]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విరాట్ కోహ్లికి చిన్న వయస్సు నుండే క్రికెట్ పట్ల ఇష్టం ఉండేది.

విరాట్ కోహ్లి సినీ నటి అనుష్క శర్మను2017లోఇటలీలో వివాహం చేసుకున్నాడు.[16][17]

ఆటనుండి విరమణ

[మార్చు]

2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 2024, జూన్ 29న జరిగిన 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ20 ప్రపంచ కప్ సాధించిన తరువాత, అంతర్జాతీయ ట్వంటీ20 ఫార్మాటు నుండి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.[18]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "https://cinecelebrity.in/virat-kohli-wiki-biography/" అనే గ్రూపులో ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన ట్యాగు కనబడలేదు